Tuesday, 17 May 2016

చరణ్ పోరాటం



రామ్ చరణ్  కధానాయకుడిగా గీత ఆర్ట్స్ పతాకం పై ఓ చిత్రం తెరకెక్కుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ కథనాయిక. "ధ్రువ" గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాత. ఈ నెల 22 నుండి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రామ్ చరణ్, ఇతర బృందం పై పోరాట ఘట్టాల్ని చిత్రీకరించనున్నారు. ఇందులో రామ్ చరణ్ ఓ కొత్త రకం అయిన లుక్ లో కనిపించబోతున్నారు. అందు కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకొన్నారు. నిర్మాత మాట్లాడుతూ "తమిళం లో విజయం సాధించిన" తని ఒరువన్'కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. రామ్ చరణ్ తెర పై కనిపించే విధానం వైవిధ్యంగా ఉంటుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొనేందుకు చాలా కష్టపడుతున్నాడు. అరవింద్ స్వామి పాత్ర , రాకుల్ అందచందాలు, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ సినిమా కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వచ్చే నెల 20 నుంచి కశ్మిర్ లో కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నామన్నారు. నాజర్ , పోసాని , తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అసీం మిశ్ర , సంగీతం: హిప్ హాప్ ఆది , కళ: నాగేంద్ర , ప్రొడక్షన్ డిజైనర్: రాజివన్ , కూర్పు: నవీన్ నూలి , సహనిర్మాత: ఎన్.వి.ప్రసాద్... 
                                                                                --- News from EENADU CINEMA
Location: India

0 comments:

Post a Comment